Saturday, October 4, 2025
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్‌లో అసూస్ ప్రత్యేక స్టోర్ ప్రారంభం..

హైదరాబాద్‌లో అసూస్ ప్రత్యేక స్టోర్ ప్రారంభం..

- Advertisement -

హైదరాబాద్‌ 2025: దేశవ్యాప్తంగా తమ రిటైల్ ఉనికిని మరింతగా బలపరచే దిశగా, తైవాన్‌కు చెందిన టెక్ దిగ్గజం ASUS(అసూస్) ఇండియా, హైదరాబాద్‌లో ప్రత్యేకమైన స్టోర్ ప్రారంభించుతున్నట్లుు ఈ రోజు ప్రకటించడం జరిగింది. సరికొత్త స్టోర్ 350+ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది . ఇందులో ASUS ఫ్లాగ్‌షిప్ ప్రొడక్టులు అయిన VivoBook, ZenBook, Republic of Gamers (ROG) ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ డెస్క్‌టాప్‌లు, ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్‌లు మరియు యాక్సెసరీలు సహా విస్తృత శ్రేణి ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ హార్డ్‌వేర్ లభ్యం అవుతాయి. ఈ బ్రాండ్ హైదరాబాద్‌లో  7వ స్టోర్‌గా స్థాపించిబడింది.

ఈ విస్తరణ గురించి మాట్లాడుతూ, ASUS(ఆసుస్) ఇండియా PC(పీసీ ) & గేమింగ్ బిజినెస్ నేషనల్ సేల్స్ మేనేజర్ జిగ్నేశ్ భవ్సర్ గారు ఈ విధంగా అన్నారు: “భారతదేశంలో మా రిటైల్ ఉనికి విస్తరణ గురించి ప్రకటించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణ మాకు ఒక కీలకమైన మార్కెట్‌గా ఉన్నందున, ముత్యాల నగరం హైదరాబాద్‌లో కొత్త బ్రాండ్ స్టోర్ ప్రారంభం అయినందున , దేశవ్యాప్తంగా వినియోగదారులకు మా యొక్క నూతన ఆవిష్కరణలను ప్రత్యేక అనుభవంగా అందించే దిశలో ఒక కీలకమైన అడుగుగా నిలుస్తుంది. వ్యూహాత్మక రిటైల్ విస్తరణ విధానంతో, వినియోగదారుల కోసం మరింత పరస్పర సంబంధాలను మరియు కొత్త టచ్‌పాయింట్లను సృష్టించడాన్ని మేము కొనసాగిస్తాము.”

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -