4వ స్థానానికి పాకిస్తాన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించిన తాజా వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. పాకిస్తాన్ వేదికగా జరుగు తున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో అదరగొడుతున్న ఆతిథ్య జట్టు 4వ స్థానానికి ఎగబాకింది. ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ 115 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగు తుండగా.. ఆ తర్వాత న్యూజిలాండ్ (109 రేటింగ్), సౌతాఫ్రికా (104 రేటింగ్) ఉన్నాయి. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ట్రైసిరీస్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా లపై వరుస విజయాలను నమోదు చేసుకున్న పాక్ తమ ర్యాంక్‌ను మెరుగు పరుచుకొని ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. 2027 వన్డే వరల్డ్ కప్‌నకు ఆటోమేటిక్‌గా అర్హత సాధించిన టాప్-8 జట్లలో పాక్ ఇప్పటికే ఉన్నప్పటికీ.. తాజా ర్యాంకింగ్స్ మెరుగుపడటం ఇదే తొలిసారి. షాహిన్ షా అఫ్రిది సారథ్యంలో తొలి సిరీస్‌నే ఆస్ట్రేలియాపై 2-1తో పాక్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. ఈ క్రమంలో ముక్కోణపు సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి పాక్ మంచి ఊపులో ఉంది. దక్షిణాఫ్రికా కంటే పాకిస్థాన్ కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ వెనుకబడి ఉండగా, ఆస్ట్రేలియా 102 రేటింగ్ పాయింట్లతో ఐదో స్ధానంలో ఉంది.





కామెంట్‌లు (0)