ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్
దుబాయ్ : న్యూజిలాండ్‌పై వెల్లింగ్టన్ లో ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. సహచర ఆటగాడు ఇషాన్ కిషన్‌కు ఈ ఏడాది జులైలో వరల్డ్ నం.1 బ్యాటర్ ర్యాంక్ కోల్పోయిన అభిషేక్ శర్మ.. న్యూజిలాండ్ పర్యటనలో తొలి రెండు మ్యాచ్‌ల్లో 29, 27 పరుగులే చేశాడు. కానీ మూడో టీ20లో 15 బంతుల్లో అర్థ సెంచరీ, 35 బంతుల్లో సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ అగ్రస్థానం తిరిగి సొంతం చేసుకున్నాడు. గాయంతో వరుసగా రెండు మ్యాచ్‌లకు దూరమైన ఇషాన్ కిషన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్ అగ్రస్థానం సాధించగా, ఆ జట్టు కెప్టెన్ తెంబ బవుమా రెండో స్థానానికి ఎగబాకాడు. ఆస్ర్టేలియాపై రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కండ్లుచెదిరే 179 పరుగుల శతక ఇన్నింగ్స్ ఆడిన బవుమా.. నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ టెస్టుల్లో వరల్డ్ నం.1గా కొనసాగుతున్నాడు.






కామెంట్లు (0)