Magazines

ఆర్చరీ ప్రీమియర్‌ ‌లీగ్‌ (ఏపీఎల్‌) ‌రెండో సీజన్‌ ‌పోటీలు

1 గంట క్రితం

Archery Premier League
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

యోధాస్ పై రాయల్స్‌ గెలుపు

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఆర్చరీ ప్రీమియర్‌ ‌లీగ్‌ (ఏపీఎల్‌) ‌రెండో సీజన్‌ ‌పోటీలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. హైదరాబాద్‌‌లోని నెక్లెస్‌‌రోడ్‌ ‌పీపుల్స్‌‌ప్లాజా వేదికగా గురువారం ఏపీఎల్‌ పోటీలు షురూ అయ్యాయి. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఆసియా క్రీడల్లో పసిడి పతకాలు సాధించిన తెలంగాణ యువ ఆర్చర్‌ ‌తానిపర్తి చికిత సహా ఇతర భారత ఆర్చర్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఏపీఎల్‌ ‌డైరెక్టర్‌ అనిల్‌ ‌కామినేని, ప్రాంఛైజీల యజమానులు, ఆర్చరీ సంఘం ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీఎల్‌‌లో ఆరు జట్లు బరిలో నిలువగా తొలి రోజు రాజ్‌‌పుతాన రాయల్స్‌, పృథ్వీరాజ్‌ ‌యోధాస్‌ ‌మ్యాచ్‌‌లో లీగ్‌ ‌మొదలైంది. డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ ‌రాయల్స్‌ 5-3‌తో యోధాస్‌‌పై విజయం సాధించింది. కాకతీయ నైట్స్‌, మైటీ మరాఠాస్‌.. చోళ చీఫ్స్‌, చెరో ఆర్చర్స్‌ ‌తర్వాతి మ్యాచ్‌‌ల్లో తలపడ్డాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్