రెండో వన్డేలో భారత్-ఏ ఓటమి
పుదుచ్చేరి : రెడ్‌బాల్ ఫార్మాట్‌లో కంగారూలపై ఆధిపత్యం చూపించిన యువ భారత్.. వైట్ బాల్ ఫార్మాట్‌లో తేలిపోతోంది. వరుసగా రెండో అనధికార వన్డేలో ఓడిన భారత్-ఏ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. పుదుచ్చేరిలో శుక్రవారం జరిగిన రెండో అనధికార వన్డేలో ఆస్ర్టేలియా-ఏ 69 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆస్ర్టేలియా-ఏ తొలుత బ్యాటింగ్ చేసి 49.5 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శామ్ కాన్స్టాస్ (67, 88 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), జోష్ ఫిలిప్ (58, 58 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీలతో రాణించారు. మెక్‌స్వీనీ (32), షా (25), ఓవెన్ (25) సైతం ఆకట్టుకున్నారు. భారత్-ఏ బౌలర్లలో అర్షద్ ఖాన్ (3/56), యశ్ ఠాకూర్ (2/46) రాణించారు. ఛేదనలో రజత్ పటీదార్ (67, 82 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో మెరిసినా.. ఇతర బ్యాటర్లు నిరాశపరిచారు. సాయి సుదర్శన్ (13), దేవదత్ పడిక్కల్ (1), రుతురాజ్ గైక్వాడ్ (12), కుమార్ కుశాగ్ర (17) విఫలమవగా భారత్-ఏ 45.2 ఓవర్లలో 206 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్ ఉండగానే ఆస్ర్టేలియా-ఏ 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.






కామెంట్‌లు (0)