హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసి సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఇప్పుడు మ్యూజికల్ జర్నీని ఫస్ట్ సింగిల్ ‘అమ్మో ఇది ఎవర్రా’తో ప్రారంభించారు. సుశిన్ శ్యామ్ కంపోజ్ చేశారు. రాకేందు మౌళి అందించిన లిరిక్స్, సింగర్ వినాయక్ తన లైవ్లీ, ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత ఎనర్జీతీసుకొచ్చారు. వీడియో గేమ్ కాన్సెప్ట్ చుట్టూ ఈ పాటను క్రియేటివ్‌గా డిజైన్ చేశారు. కొరియోగ్రాఫర్ రాజ్ ప్రియన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.






కామెంట్‌లు (0)