నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్-వెస్టిండీస్ మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐదో టీ20 మ్యాచ్పై వర్షం నీడ కమ్ముకుంది. ఇప్పటికే సిరీస్ 2-2తో సమంగా ఉండటంతో ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది. దీంతో నిర్ణయాత్మక పోరుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అక్యూవెదర్ అంచనా వేసింది. టాస్ సమయానికి వర్షం పడే అవకాశం 34-49 శాతం మధ్య ఉండగా, మ్యాచ్ తొలి మూడు గంటల్లో ఇది 34 నుంచి 40 శాతానికి పెరగవచ్చని తెలిపింది. రాత్రి 10 గంటల సమయంలో వర్షం పడే అవకాశం 78 శాతానికి చేరవచ్చని పేర్కొంది. చిన్నస్వామి స్టేడియంలో నీరు త్వరగా బయటకు వెళ్లేందుకు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ, భారీ వర్షం కురిస్తే మ్యాచ్కు అంతరాయం కలగవచ్చు. దీంతో నిర్ణయాత్మక టీ20 పూర్తిగా జరుగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
భారత్-వెస్టిండీస్ ఐదో టీ20పై వర్షం సూచన!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం


కామెంట్లు (0)