Magazines

ఎస్‌జీఎం నిర్వహణకు అనుమతివ్వండి

2 గంటల క్రితం

SGM
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 2 నిమిషాల చదవడం

ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీ ఏర్పాటుకు సహకరించండి : ఏకసభ్య కమిటీకి హెచ్‌సీఏ సభ్యుల వినతి


నవతెలంగాణ-హైదరాబాద్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రత్యేక సర్వ సభ్య సమావేశం (ఎస్‌జీఎం) నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఏకసభ్య కమిటీ చైర్మెన్‌ జస్టిన్‌ నవీన్‌ రావును ఆ సంఘం సభ్యులు కోరారు. ఈ నెల 21న హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ గడువు ముగియగా, నిర్దేశిత సమయంలోగా ఎన్నికల నిర్వహణకు అప్పటి కార్యదర్శి, ఏకసభ్య కమిటీ చైర్మెన్‌ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా, గత అపెక్స్‌ కౌన్సిల్‌ పదవీ కాలం ముగిసినా, కొత్త కార్యవర్గం ఏర్పాటు కాలేదు. దీంతో హెచ్‌సీఏ పరిపాలన వ్యవహారాలు పూర్తిగా ఏకసభ్య కమిటీ పరిధిలోకి వెళ్లిపోయాయి. ఈ పరిస్థితికి తెరదించేందుకు హెచ్‌సీఏ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం, వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ శివలాల్‌ యాదవ్‌, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ అర్షద్‌ అయూబ్‌, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి జాన్‌ మనోజ్‌ సహా పలువురు క్లబ్‌ కార్యదర్శులు ఏకసభ్య కమిటీ చైర్మెన్‌ నవీన్‌రావును కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తొలుత ఎస్‌జీఎం, ఆ తర్వాత ఏజీఎం

'ప్లేయర్స్‌ వస్తారు, వెళ్లారు. అడ్మినిస్ట్రేటర్స్‌ వస్తారు, వెళ్తారు. కానీ అసోసియేషన్‌ అలానే కొనసా గుతుంది. అసోసియేషన్‌ నడిపించేందుకు ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు. ప్రత్యేక సర్వ సభ్య సమావేశం, వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహణ కు అనుమతి ఇస్తే అసోసియేషన్‌ నిర్వహణకు అపెక్స్‌ కౌన్సిల్‌ను ఎన్నుకుని ముందుకు సాగుతాం. అందు కు ఏకసభ్య కమిటీ చైర్మెన్‌ జస్టిస్‌ నవీన్‌రావు అనుమ తించాలని కోరుతున్నానని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్‌ యాదవ్‌ కోరారు. హెచ్‌సీ ఏ మాజీ అధ్యక్షు డు అర్షద్‌ అయూబ్‌ మాట్లా డుతూ.. 'అపెక్స్‌ కౌన్సిల్‌ గడువు ముగిసింది. అక్టోబర్‌ 21న ఎన్నికలు జరిగి కొత్త కమిటీ ఏర్పాటు కావాలి.


కానీ అది జరుగులేదు. గతంలో సుప్రీంకోర్టు చెప్పిన ట్టుగా హెచ్‌సీఏ రాజ్యాం గంలో కొన్ని నిబంధనలు మార్చాల్సి ఉంది. అపెక్స్‌ కౌన్సిల్‌లో కౌన్సిలర్స్‌ సంఖ్య పెంచాల్సి ఉంది. అందుకు ప్రత్యేక సర్వ సభ్య సమావే శంలో నిర్ణయా లు తీసుకోవాలి. ముందుగా ఎస్‌జీఎం నిర్వహించి ఆ మార్పులు చేసిన తర్వాత, మరో నెల రోజుల్లో ఏజీఎంలో కొత్త కమిటీని ఎన్నుకోవాలి. నవంబర్‌ 15న ఎస్‌జీఎం నిర్వహణకు అనుమ తి ఇవ్వాలని కోరాం. ఏకసభ్య కమిటీ చైర్మెన్‌ జస్టిస్‌ నవీన్‌రావు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. సానుకూలంగానే స్పందిస్తారని అనుకుంటున్నామని' అన్నారు.

108 మంది సంతకాలతో లేఖ

అక్టోబర్‌ 21న గత అపెక్స్‌ కౌన్సిల్‌ గడువు ముగిసినా, కొత్త అపెన్స్‌ కౌన్సిల్‌ ఎన్నికపై ఎటువంటి స్పష్టత లేకపోవటంతో ప్రత్యేక సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 108 మంది క్లబ్‌ కార్యదర్శులు సంతకాలు చేసిన లేఖను ఏకసభ్య కమిటీ చైర్మెన్‌ నవీన్‌రావుకు అందజేశారు. లేఖ ఇచ్చినా, ఎస్‌జీఏం నిర్వహణపై ఎటువంటి సంకేతాలు రాలేదని, ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని, ఇకనైనా జస్టిస్‌ నవీన్‌రావు త్వరగా ఈ అంశంలో ఓ నిర్ణయం తీసుకోవాలని హెచ్‌సీఏ సభ్యులు కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్