Magazines

సైమన్‌ సిక్సర్‌ సఫారీ విన్నర్‌

58 నిమిషాల క్రితం

Safari Winner
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

మూడో టెస్టులో ఆసీస్‌పై గెలుపు

కేప్‌టౌన్‌: రసవత్తరంగా సాగిన ఆస్ర్టేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను ఆతిథ్య సఫారీలు సొంతం చేసుకున్నారు. తొలి టెస్టులో ఓటమి నుంచి పుంజుకున్న దక్షిణాఫ్రికా వరుస టెస్టుల్లో గెలుపొంది 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. కేప్‌టౌన్ టెస్టులో 288 పరుగుల ఛేదనలో ఆస్ర్టేలియా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించినా.. ఆఖరు రోజు పిచ్‌పై కంగారూలు కంగుతిన్నారు. స్పిన్నర్‌ సైమన్‌ హార్మర్‌ (6/16) స్పిన్‌ మాయాజాలానికి తోడు పేసర్‌ కగిసో రబాడ (3/39) నిప్పులు చెరగటంతో ఆస్ర్టేలియా రెండో ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే కుప్పకూలింది. ట్రావిశ్‌ హెడ్‌ (14), మాట్‌ రెన్షా (0), లబుషేన్‌ (4), కామెరూన్‌ గ్రీన్‌ (27), ఇంగ్లిశ్‌ (4), అలెక్స్‌ (2), కూపర్‌ (0), స్టార్క్ (0), కమిన్స్‌ (11), హేజిల్‌వుడ్‌ (0) తేలిపోయారు. 57.1 ఓవర్లలో ఆసీస్‌ కుప్పకూలింది. 176 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మూడో టెస్టులో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టిన సైమన్‌ హార్మర్‌ 'ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్'గా నిలువగా.. 13 వికెట్లతో పాటు 198 పరుగులతో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన మార్కో యాన్సెన్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌'గా నిలిచాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్