- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఏటీఎంలో పెట్టాల్సిన డబ్బును సొంతానికి వాడుకుని.. ఆ నేరం బయటపడకుండా అగ్ని ప్రమాదంగా చిత్రీకరించిన ఇద్దరు కేటుగాళ్లు అరెస్టు అయ్యారు. యానాం కొత్త బస్టాండ్ వద్ద ఎస్‌బీఐ ఏటీఎం జులై 8న తెల్లవారుజామున మంటల్లో కాలిపోయింది. దీనిని ప్రమాదంగా భావించినా.. పోలీసుల విచారణలో కుట్ర కోణం బయటపడింది. ఏటీఎంలో నగదు పెట్టే ఇద్దరు సిబ్బంది రూ.12 లక్షలు చోరీ చేసి, ఏటీఎంకు నిప్పు అంటించినట్లు తేలింది.
- Advertisement -