Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆత్మబంధు…

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆత్మబంధు…

- Advertisement -


నవతెలంగాణ-పెద్దవూర
ఆత్మబంధు – ఎప్పటికీ మీతో కార్యక్రమంలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ నిరుపేదలకు అండగా నిలుస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న. అంత్యక్రియలు అనంతరం భోజనాలు అందిస్తున్నారు. సాగర్ నియోజకవర్గంలోని పలు మండలాల పరిధిలో గల వివిధ గ్రామాల్లో నివసించిన వారు మరణించారని తెలుసుకొని వారి కుటుంబాలకి అండగా నిడమనూరు మండలం గుంటుక గూడెం,త్రిపురారం మండలం, అనుముల మండలం, మాడుగుల పల్లి మండలం గజలాపురం, గోపాలపురం, నిడమానూరు మండలం జంగాల వారి గూడెంలో వివిధ కారణాల వల్ల మృతి చెందిన ఆరు కుటుంబాలకు ఒక్కోక్కరికి 100 భోజనాల చొప్పున 600 భోజనాలు తన పౌండేషన్ ద్వారా ఉచితంగా అందజేశారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 9581742356, 9885147535, 7799585859లకు సంప్రదించవలసినదిగా కోరారు.

అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనదని, అన్నం పరబ్రహ్మ స్వరూపం దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్న మనిషిని పూర్తిగా సంతృప్తి పరిచేది ఒక్కఅన్నదానం మాత్రమే అని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి అన్నారు. నిరుపేదలని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ ‘ఆత్మబంధు` కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అనంతరం
అనుముల మండలం, చింతగూడెం గ్రామానికి చెందిన కురాకుల సైదులు యాదవ్ మృతి చెందడంతో పార్ధీవ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ కురాకుల రాములు యాదవ్,బుసిరెడ్డి మట్టా రెడ్డి, కోడుమూరు వెంకటరెడ్డి, కురాకుల శ్రీను యాదవ్, వెంకులు యాదవ్, కోటిరెడ్డి, గజ్జల శివారెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, ఇస్రం లింగస్వామి, షేక్ అబ్దుల్ కరీం, పసుపులేటి నితిన్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -