Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్హైద‌రాబాద్‌లో దారుణం..ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన‌ భార్య

హైద‌రాబాద్‌లో దారుణం..ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన‌ భార్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసింది. ఈ ఘటన నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన జెల్లెల శేఖర్(40), చిట్టి (33) దంపతులకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. బతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి గత కొన్నేళ్లుగా కోదండరాంనగర్ రోడ్ నెం.7లో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. శేఖర్ వృత్తి రీత్యా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చిట్టి గతంలో ఒక వస్త్ర దుకాణంలో పనిచేసేది. ఆ సమయంలో హరీష్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది.

భర్త శేఖర్ డ్రైవింగ్ వృత్తిపై బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చిట్టి హరీష్‌తో అక్రమ సంబంధం కొనసాగించింది. విషయం తెలిసిన భర్త పలుమార్లు చిట్టిని నిలదీశాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని చిట్టి నిర్ణయించుకుంది. ఈనెల 28న రాత్రి సమయంలో ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి ప్రియుడిని ఇంటికి పిలిచింది. పడుకున్న తర్వాత ఇద్దరూ కలిసి శేఖర్ గొంతు నులిమి చంపేశారు. అనంతరం తలపై బలంగా రాడ్డుతో కొట్టారు. అనంతరం తనకు ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫోన్ చేసి తన భర్త నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న సరూర్ నగర్ పోలీసులు భార్యపై అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. తన ప్రియుడితో కలిసి భర్తను తానే హత్య చేసినట్లు భార్య ఒప్పుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి చిట్టిని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి తరలించినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. ప్రియుడు హరీష్ పరారీలో ఉన్నాడని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad