Thursday, July 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుBasavataraka Nagar : బసవతారక నగర్ గుడిసె వాసుల పై దాడి

Basavataraka Nagar : బసవతారక నగర్ గుడిసె వాసుల పై దాడి

- Advertisement -



నవతెలంగాణ మియాపూర్: రంగారెడ్డి జిల్లా శేర్ లింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డి గ్రామ పరిధిలోని బసవ తారక నగర్ లో గత కొద్దిరోజులుగా గుడిసె వాసులపై ప్రయివేటు వ్యక్తుల దౌర్జన్యం కొనసాగుతుండగా గత అర్ధరాత్రి వందల సంఖ్యలో గుర్తుతెలియని వ్యక్తులు గుడిసె వాసులపై దాడులకు తెగబడ్డారు.

రాడ్లు, కర్రలు వచ్చి ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్తారా లేదా లేదంటే మిమ్మల్ని చంపేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేశారు. దుండగులు బెదిరించినట్లు గుడిసె వాసులపై తెలిపారు. ఈ దౌర్జన్యంలో ముత్తు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, కొంతమంది మహిళలకు సైతం గాయాలు కావడంతో దాడులకు యత్నించిన కొంతమందిని పట్టుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించినట్టు గుడిసె వాసుల తెలిపారు. గత 40 ఏండ్లుగా పేదలు ఇక్కడే జీవనం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

గత పది రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు అక్కడున్న కుటుంబాలను భయపెట్టి ఖాళీ చేయించగా మరి కొంతమంది వ్యక్తులు అక్కడ నుండి కదిలేది లేదని కూర్చున్నారు. వీరిపై దౌర్జన్యం కొనసాగుతున్నంతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఇతర ప్రజాసంఘాల నాయకులు బసవతారక నగర్ లో పర్యటించి వారికి మద్దతు తెలిపారు. దీనిని జీర్ణించుకోలేని వ్యక్తులు రెండు రోజులుగా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వారు వాపోయారు. వీటిపై పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -