Monday, November 3, 2025
E-PAPER
Homeజిల్లాలుబిఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఆమానుషం 

బిఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఆమానుషం 

- Advertisement -

లాకావత్ నరసింహ నాయక్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు 

నవతెలంగాణ గోవిందరావుపేట 

మణుగూరు బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడి అమానుషమని బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లాకావత్ నరసింహ నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నరసింహ నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అసహనంతో ఆక్కసుతో నే బిఆర్ఎస్ కార్యాలయం పై దాడికి పాల్పడిందని అన్నారు. ఈ ప్రభుత్వంలో గుండాయిజం రౌడీయిజం విస్రుంకలంగా పెరిగిపోయాయని అన్నారు. ఇది ప్రజలకు ఎంత మాత్రం క్షేమకరం కాదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమి తప్పదనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దురాగతాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై జరిగిన ఈ దాడిని ప్రతి ఒక్కరు ఖండిస్తూ మద్దతు తెలపాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని అన్నారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు. లేనియెడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -