Tuesday, October 7, 2025
E-PAPER
Homeహైదరాబాద్చీఫ్ జస్టిస్‌పై దాడి హేయం

చీఫ్ జస్టిస్‌పై దాడి హేయం

- Advertisement -

మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డా.మంచాల లింగస్వామి
న‌వ‌తెలంగాణ – హైదరాబాద్


భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్‌పై మనువాద లాయర్ కాలి బూటుతో దాడి చేయడాన్ని మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డా.మంచాల లింగస్వామి తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్‌లోని మాల ప్రజా ఫ్రంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి చేసిన మనువాద లాయరును కఠినంగా శిక్షించాలి. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న వ్యక్తిని కులం, మతం ఆధారంగా అవమానించడం భారత దేశానికే సిగ్గు చేటు. మనువాదుల కుట్రలో భాగంగా పథకం ప్రకారమే ఈ దాడి జరిగింది. ఈ దాడి కేవలం గవాయ్‌పై జరిగిన దాడే కాదు. ముమ్మాటికీ భారత రాజ్యాంగం మీద, యావత్తు దళిత సమాజం మీద, దేశ లౌకిక విధానం మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న చీఫ్ జస్టిస్‌ హోదాలో ఉన్న వ్యక్తిని అగౌరవ పరిచి, అవమానిస్తున్న మనువాదులు సామాన్య పేద, దళిత ప్రజలను ఎలా అవమానిస్తున్నారో, హింసిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాల ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కరణం కిషన్, కో ఆర్డినేటర్ ఆవుల సుధీర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ దాసరి విశాల్, అధ్యక్షులు మైసే నాందేవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి చేపూరి నర్సింహా, మన్నే రంగ, సువర్ణ, అంజలి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -