నవతెలంగాణ-హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించిన ఘటనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సిజెఐపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఆందోళనకరమైన ఘటన సంఘ్ పరివార్ వ్యాప్తి చేస్తున్న మత విద్వేషాలను ప్రతిబింబిస్తోందని అన్నారు. ఈ ఘటనను వ్యక్తిగత చర్యగా తోసిపుచ్చడమంటే, పెరుగుతున్న అసహన వాతావరణాన్ని విస్మరించడమేనని అన్నారు. మతతత్వ మూఢత్వం సిజెఐని కూడా లక్ష్యంగా చేసుకోవడానికి ధైర్యం చేసిందంటే.. ఇది విభజన మరియు విషపూరిత రాజకీయాల తీవ్రమైన ప్రమాదాన్ని బహిర్గతం చేస్తోందని, వాటిని నిస్సందేహంగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం సిజెఐపై ఒక న్యాయవాది షూ విసిరేందుకు యత్నించిన సంగతి తెలిసిందే.
సిజెఐపై దాడి మత విద్వేషాలను ప్రతిబింబిస్తోంది: పినరయి విజయన్
- Advertisement -
- Advertisement -



