Monday, March 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై అప్ఘానిస్థాన్ దాడి

నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై అప్ఘానిస్థాన్ దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఓ వైపు ప‌శ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడుల‌తో విధ్వంసం సృష్ట‌స్తున్నాయి. మ‌రో వైపు ఆసియా ఖండంలోని పాకిస్థాన్- అప్ఘానిస్థాన్ దేశాల మ‌ధ్య భీక‌ర దాడులు చేసుకుంటున్నాయి. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ (Nur Khan Airbase)పై అప్ఘాన్ దాడులు చేసింది. క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పలు కీలకమైన పాక్‌ సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. తమ దేశంలోని వివిధ ప్రాంతాలపై పాకిస్థాన్ దాడుల‌కు, పాక్‌ చొరబాట్లకు ప్రతీకారం తీర్చుకొనేందుకే ఈ దాడులు చేశామని అఫ్గాన్‌ తెలిపింది. తమ దాడుల్లో నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ సహా ఇతర సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. మరోవైపు తూర్పు అఫ్గాన్ నగరమైన జలాలాబాద్‌లో పాకిస్థాన్‌ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తాలిబన్‌ అధికారులు వెల్లడించారు. విమాన పైలట్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -