Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి దుర్మార్గం

సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి దుర్మార్గం

- Advertisement -

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ 
జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి దాసు
నవతెలంగాణ – ఆర్మూర్

సుప్రీంకోర్టు కోర్టు న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ పైన మతోన్మాది రాకేష్ కిషోర్ తివారి న్యాయవాది చెప్పులు విరిసి, దాడి చేయడం దుర్మార్గమని న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ఖండించారు. పట్టణంలో ఐఎఫ్టియు ఆఫీసులో పాత్రికేయుల సమావేశాన్ని గురువారం  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్, బిజెపి దేశంలో ప్రజల మధ్య మత వైషామ్యాలు పెంచుతూ..  మానవతా విలువలను మంట కలుపుతూ, ఘర్షణలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. న్యాయమూర్తి పై దాడి చేయడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లు అని ఆయన అన్నారు. దళితులు ఉన్నతమైన పదవిలో ఉండడం సహించని బ్రాహ్మనీయ భావాజాలం నెత్తికెక్కిన వాళ్ళు సహించడం లేదని, ఈ ఘటన మరోసారి నిరూపిస్తుందని ఆయన అన్నారు.

జర్నలిస్టు గౌరీ లంకేష్ వాస్తవానికి రాస్తే దారుణంగా హత్య చేసినప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం మౌనం వహించిందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడులను నియంత్రించకపోవడంతో దేశంలో అనేక దుర్మార్గపు దాడులు మితిమీరుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక, ప్రజాస్వామిక దేశంలో, భావ ప్రకటన స్వేచ్ఛ హరించబడుతుందని ఆయన పేర్కొన్నారు. దళిత వ్యతిరేకి అయిన ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో నడుస్తున్న బిజెపి అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్న  విషయం  దళితులు, ముస్లిం లు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.

మతోన్మాది రాకేష్ తివారి న్యాయవాది తమ పరిధిని దాటి, కోర్టులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై, దాడి చేసినందుకు ఆయనపై తగిన చర్య తీసుకోవాలని దాసు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు అబ్దుల్, ప్రజా సంఘాల నాయకులు ఫ్రీన్స్, వెంకటేష్, వర్ణారెడ్డి, హుస్సేన్, పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -