నవతెలంగాణ-హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీకి సీఎం మమతా బెనర్జీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ భాష మాట్లాడే వ్యక్తులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా విజయం సాధించలేరని సవాల్ విసిరింది. ఇవాళ నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ నుండి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని సమయాన్ని బీజేపీ చవిచూస్తుందని, బెంగాలీలపై భాషాపరమైన ఉగ్రవాదాన్ని ప్రయోగించే ఏ పార్టీ కూడా బెంగాల్‌ను గెలవలేదని ఆమె అన్నారు. “బెంగాలీలను హింసించినందుకు బిజెపిని నేను ఖండిస్తున్నాను. బెంగాల్‌లో ఒక్క బిజెపి ఎమ్మెల్యే కూడా ఉండని సమయం త్వరలో వస్తుంది. ప్రజలే దానిని నిర్ధారిస్తారు. బిజెపి ఖచ్చితంగా ఓటమిని చవిచూస్తుంది. ఎందుకంటే బెంగాలీలపై భాషాపరమైన ఉగ్రవాదాన్ని ప్రయోగించే ఏ పార్టీ కూడా బెంగాల్‌ను గెలవదని ధ్వజమెత్తారు. బీజేపీ ఓట్ల దొంగ పార్టీ అని సంబోధించారు. దేశవ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరిగిన సంఘటనలను ఖండిస్తూ తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.