నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని, ఇది అప్రజాస్వామికం అని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఇవి ప్రజాస్వామ్యంపై ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారం జరుగుతున్న దాడులని ఆయన అభివర్ణించారు. సాక్షి టీవీ యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ను జగన్ ఖండించారు. సోమవారం కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేయగా, మంగళవారం గుంటూరులోని కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సాక్షి చానల్లో కొమ్మినేని వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ కార్యక్రమంలో అమరావతి ప్రాంత మహిళలపై కించపరిచేలా మాట్లాడారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ. అయితే, కొమ్మినేని ఎప్పుడూ అనని మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు వక్రీకరించి, ఆయనపై తప్పుడు కేసు బనాయించి, అక్రమంగా అరెస్ట్ చేయించారని జగన్ ఆరోపించారు.
సాక్షిపై దాడులు అప్రజాస్వామికం: వైఎస్ జగన్
- Advertisement -
- Advertisement -