– సర్పంచ్ ఉపసర్పంచ్ గ్రామస్తులు అడ్డుకోవడంతో తిరిగు ప్రయాణం
నవతెలంగాణ-నవాబు పేట : మండల కేంద్రానికి చెందిన గ్రంథాలయం మూసివేతకు జిల్లా గ్రంథాలయానికి సంబంధించిన అధికారులు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే గ్రంథాలయం మూసివేసేందుకు ప్రయత్నించారు. అధికారులు అధికారిక ఉత్తర్వులు లేకుండా గ్రంథాలయం మూసివేతకు సిద్ధమైన సందర్భంగా అక్కడ పనిచేసే రమేష్ గత తొమ్మిది నెలలుగా ఎలాంటి జీతభత్యం లేకుండా ఉచితంగా విధులు నిర్వహిస్తున్నానని, అయినా కూడా ఇక్కడ గ్రంథాలయంలో ఎవరూ లేరని ఉద్దేశంతో పై అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చేందుకు సంబంధించిన అధికారులు వ్యవహరిస్తున్నారని వారి తీరును పసిగట్టి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ పెద్దలకు రమేష్ సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని గ్రంధాలయం మూసివేతకు తాము ఒప్పుకోమని ఎలాంటి ఉత్తర్వులు ఉన్నా తమకు చూపించాలని కరాకండిగా చెప్పడంతో గ్రంథాలయ అధికారులు వారికి ఏమీ సమాధానం చెప్పలేక తిరుగుప్రయాణమయ్యారు ఈ సందర్భంగా సర్పంచ్ గీతారాణి సుధాకర్ చారి, ఉపసర్పంచ్ హజాహర్ అలి, గ్రామ పెద్దలు గ్రంధాలయ అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. గ్రంథాలయాలు జ్ఞానబండాగారాలని నేటి సాంకేతిక పరిజ్ఞానంలో కూడా గ్రంథాలయాలు ప్రోత్సహించాల్సింది పోయి మూసివేతకు సిద్ధమైతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భారీ ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
అధికారిక ఉత్తర్వులు లేకుండానే గ్రంథాలయం మూసివేతకు యత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



