నవతెలంగాణ – తిమ్మాపూర్
బాలికను కిడ్నాప్ చేసి ఆమె తల్లిదండ్రులను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేద్దామనుకున్న గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఆ తల్లి బిడ్డను కాపాడిన సంఘటన మండలంలోని రేణికుంట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక (7) ఒకటో తరగతి చదువుతుండగా మంగళవారం ఉదయం స్కూల్ కు వెళ్లి ఎప్పటిలాగే జ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. సాయంత్రం సమయంలో బహిర్భూమి కోసం ఇంటికి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి తన కొడుకును వెంట బెట్టుకొని వెళ్లి తన బిడ్డ కోసం అరువగా పొదల మాటున ఉన్న గుర్తుతెలియని వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడే ఉన్న బాలిక నుంచి ఆమె తల్లి వివరాలు తెలుసుకోగా వ్యక్తి తన మెడపై కత్తి పెట్టి తనను కిడ్నాప్ చేసి రూ.లక్ష డిమాండ్ చేసేందుకు యత్నించాడని తల్లికి తెలిపింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
బాలిక కిడ్నాప్ కు యత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES