- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో గ్యాస్ కొరత(Gas Cylinders) తీవ్ర స్థాయికి చేరుకుంది. బుక్ చేసి రోజుల తరలబడి ఎదురు చూసినా రాకపోవడంతో ఆగ్రహం చెందిన వినియోగదారులు చోరీలకు సైతం పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ పరిధిలోని షేక్పేట్(Shaikpet) గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లతో బయటికి వచ్చిన ఆటో నుండి అనుమతి లేకుండా సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఏజెన్సీ సిబ్బంది స్థానికుల సహాయంతో వారిని అడ్డుకున్నారు. కాగా, గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ కోసం కూడా నగరంలో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరారు.
- Advertisement -


