నవతెలంగాణ-హైదరాబాద్ : నల్గొండ జిల్లా స్థానిక మండలంలోని బంగారిగడ్డ గ్రామ పంచాయతీకి 11 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. గ్రామస్థులందరూ గ్రామాభివృద్ధే ధ్యేయంగా భావించి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం గ్రామంలో వారంతా కూర్చొని చర్చించగా.. గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయం, గ్రామ అభివృద్ధి కోసం తాము సిద్ధంగా ఉన్నామని నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు తెలిపారు. దీనికి గ్రామస్థులందరూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి రూ.73 లక్షలతో గ్రామ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. దీనికి అభ్యర్థులందరూ అంగీకారం తెలుపుతూ దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంటామంటూ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. దీంతో ఆ గ్రామపంచాయతీ స్థానం ఏకగ్రీవమైంది. కాగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
సర్పంచి పదవికి వేలం..రూ.73 లక్షలతో కైవసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


