Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చు వివరాలపై అడిట్

గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చు వివరాలపై అడిట్

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల ఖర్చు వివరాలపై అధికారులు ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు పోటీ చేసిన అభ్యర్థులు సమర్పించిన ఖర్చు వివరాల రికార్డులను పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికల ఆడిట్ అధికారి శివ ప్రసాద్ ఒక్కో అభ్యర్థి వారీగా సమర్పించిన ఖర్చు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.

  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన, ఓడినా అభ్యర్థులు పలువురు అధికారులు నిర్వహిస్తున్న ఆడిట్ లో పాల్గొని తాము సమర్పించిన  ఖర్చు వివరాల్లో అధికారులకు సందేహాలున్న లావాదేవీలపై వివరణలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆడిట్ అధికారి శివ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల ఖర్చుల వివరాలను క్షుణంగా పరిశీలిస్తూ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -