Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయందారుణం..మేనల్లుడిని ముక్కలుగా చేసి

దారుణం..మేనల్లుడిని ముక్కలుగా చేసి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ మహిళ తన మేనల్లుడిని చంపి ముక్కలుగా చేసి.. సిమెంటుతో పూడ్చిన దారుణ ఘటన పశ్చిమబెంగాల్‌లోని దినాజ్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాల్దా జిల్లాకు చెందిన సద్దా నదాబ్‌ ఒప్పంద కూలీగా పనిచేస్తున్నాడు. అతడు గత నెల 18 నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుసకు అత్త అయిన మౌమితా హసన్‌తో అతడికి సన్నిహిత సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో ఆమెను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. నదాబ్‌ తన ఫొటోలను బయటపెడతానని పదేపదే బెదిరించడంతో చంపేశానని మౌమిత అంగీకరించింది. మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసి, తన తండ్రి ఇంట్లో సిమెంటుతో పూడ్చినట్లు వెల్లడించింది. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి తవ్వగా మృతదేహం ముక్కలు బయటపడ్డాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad