ఛత్రపతి శంభాజీనగర్‌గా నామకరణం
దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
మూడేండ్ల క్రితమే నగరం పేరును మార్చిన ‘మహా’ సర్కారు
ముంబయి : మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కారు.. అభివృద్ధిని పక్కకుబెట్టి నగరాలు, రైల్వే స్టేషన్ల పేర్లను మార్చటమే లక్ష్యంగా నిర్దేశించుకున్నది. మొఘల్ చక్రవర్తుల ఆనవాళ్లే లేకుండా వ్యవహరిస్తున్నది. దాదాపు మూడేండ్ల క్రితం అప్పటి మహాయుతి సర్కారు చారిత్రక ఔరంగబాద్ నగరాన్ని.. ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చిన విషయం విదితమే. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కారు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కలిసి ఔరంగబాద్ రైల్వే స్టేషన్ పేరును కూడా మార్చాయి. ఇప్పుడది ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ మారింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన చేసింది. కొత్త స్టేషన్ కోడ్‌ను సీపీఎస్‌ఎన్ అని వివరిం చింది. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ఈనెల 15న ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చడానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తాజా పేరు మార్పును అధికారికం చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించటం ప్రక్రియ పూర్తయింది.
ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌ను 1900 సంవత్సరంలో హైదరాబాద్ 7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ప్రారంభించారు. నాటి నుంచి ఈ స్టేషన్ మరఠ్వాడా ప్రాంతంలో ఒక ముఖ్యమైన జంక్షన్‌గా సేవలను అందిస్తున్నది. ప్రస్తుతం ఛత్రపతి శంభాజీనగర్‌గా పిలవబడుతున్న ఈ నగరం ఒక ప్రధాన పర్యాటక కేంద్రం. దీని చుట్టూ అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గడించిన అజంతా, ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఈ రెండూ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందిన విషయం విదితమే. అలాగే మొఘల్ శకానికి చెందిన చారిత్రక బీబీ-కా-మక్బరా వంటివి కూడా ఈ నగరంలోనే ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పేరు మీద ఈ నగరానికి ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి శంభాజీగా మహాయుతి సర్కార్ పేరు మార్చింది. మహా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి సర్కారు దాదాపు మూడేండ్ల క్రితం ఔరంగాబాద్ నగరాన్ని అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్చిన విషయం విదితమే. మళ్లీ ఇప్పుడు అదే పేరును కలిగిన స్టేషన్‌కు కూడా కొత్త పేరును తీసుకొస్తూ తాజా చర్యలకు ఉపక్రమిం చడం గమనార్హం. రైల్వే స్టేషన్ పేరు మార్పు గురించి అక్కడి స్థానికు లు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. చారిత్రక గుర్తింపును కలిగి ఉన్న నగరా నికి, రైల్వే స్టేషన్‌కు పేరు మార్చాల్సిన అవసరం ఏమున్నదని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలను వారు ప్రశ్నిస్తున్నారు. సంఫ్‌ు ఎజెండాలో భాగంగానే బీజేపీ ప్రభుత్వాలు ఇలాంటి పేరు మార్పు చర్యలకు ఉపక్రమిస్తున్నాయని మేధావులు ఆరోపిస్తున్నారు.
ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు మార్పు
- Advertisement -
- Advertisement -



