- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో భారత్‌తో జరిగే మ్యాచ్ నుంచి పాకిస్థాన్ వైదొలగనున్నట్లు నిన్న ప్రకటించింది. దీనిపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందిస్తూ, ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఇటీవల పాకిస్థాన్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్, భారత్‌లో పర్యటించే ప్రతి జట్టుకు భద్రత ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. అయితే, భారత్-పాక్ మ్యాచ్‌పై తాను స్పందించి వివాదాన్ని పెంచదలచుకోలేదని, తాము ప్రపంచ కప్‌పైనే దృష్టి సారించామని తెలిపారు.
- Advertisement -



