Saturday, October 25, 2025
E-PAPER
Homeఆటలు236 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా

236 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. యువ పేసర్ హర్షిత్ రాణా నాలుగు వికెట్లతో సత్తా చాటడంతో ఆస్ట్రేలియా జట్టు 236 పరుగులకే ఆలౌట్ అయింది. సిరీస్‌లో క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోవాలంటే టీమిండియా 237 పరుగులు చేయాల్సి ఉంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు మంచి ఆరంభమే లభించినా, భారత బౌలర్లు పుంజుకోవడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో మాథ్యూ రెన్‌షా అర్ధ శ‌త‌కం (56) రాణించ‌గా…కెప్టెన్ మిచెల్ మార్ష్ 41, మాథ్యూ షార్ట్ 30 ర‌న్స్ చేశారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. అలాగే వాషింగ్ట‌న్ సుంద‌ర్ 2 వికెట్లు తీయ‌గా… సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, అక్ష‌ర్, కుల్దీప్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -