Tuesday, December 9, 2025
E-PAPER
Homeక్రైమ్తిరుపతిలో మైనర్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక‌దాడి

తిరుపతిలో మైనర్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక‌దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తిరుపతిలో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న మైనర్ విద్యార్థినిపై ఒక ఆటోడ్రైవర్ లైంగిక‌దాడికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం ప్ర‌యివేటు హాస్టల్‌లో ఉంటున్న ఈ విద్యార్థిని వేరే హాస్టల్‌కు మారే క్రమంలో ర్యాపిడో ఆటో టాక్సీలో రిజిస్టర్ అయిన ఆటో డ్రైవర్ సాయికుమార్ పరిచయమయ్యాడు. వారి మధ్య పరిచయం పెరగడంతో సదరు ఆటో డ్రైవర్‌ను విద్యార్థిని కొంత ఆర్థిక సహాయం కోరింది. దీంతో అతను ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకున్నాడని పోలీసులు అన్నారు. బాలికను తెలివిగా మభ్యపెట్టి తన గదికి తీసుకెళ్లిన అతను అక్కడ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పారు. లైంగిక‌దాడియాత్న‌నికి సంబంధించిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ హేయమైన చర్య తర్వాత బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి ధైర్యం చేసి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందన్నారు.

​బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడు సాయికుమార్‌పై క్రైమ్ నెంబర్ 448/2025 కింద, పొక్సో చట్టం 2012 ప్రకారం కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మైనర్ బాలికపై జరిగిన ఈ అఘాయిత్యం తిరుపతిలో కలకలం సృష్టించింది. ఈ చట్టం పిల్లలపై జరిగే లైంగిక నేరాలనుండి వారిని రక్షించడానికి ఉద్దేశించబడిందని పోలీసులు తెలిపారు.

అయితే ఈ దారుణఈ ఘటనపై విద్యాసంస్థల విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని త్వరగా పట్టుకుని, కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, పౌర సమాజం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -