- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని మీర్ చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 11 ఏండ్ల బాలిక కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న బాలికను సయ్యద్ షబ్బీర్ అలీ అనే ఆటో డ్రైవర్, ‘నీ తండ్రి పంపించాడు’ అని చెప్పి ఆటో ఎక్కించుకున్నాడు. మలక్‌పేట్ వైపు తీసుకెళ్తుండగా, అనుమానం వచ్చి బాలిక ఆటో నుండి దూకి బయటపడింది. స్థానికులు ఆటో డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
- Advertisement -