Saturday, July 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆటోమేటెడ్‌ జనరేటర్లను సమకూర్చుకోవాలి

ఆటోమేటెడ్‌ జనరేటర్లను సమకూర్చుకోవాలి

- Advertisement -

– మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్‌

జనరేటర్‌ సౌకర్యం లేని ఆస్పత్రుల్లో ఆటోమేటెడ్‌ జనరేటర్లను సమకూర్చు కోవాలనీ, విద్యుత్‌ నిర్వ హణ కోసం తాత్కాలిక పద్ధతిలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లను నియమించుకో వాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికా రులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరంతర విద్యు త్తు సరఫరాపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకో వాలని దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి జనరేటర్‌ల పనితీరు వాటి సామర్థ్యంపై చర్చిం చారు. విద్యుత్‌ సరఫరాకు అవసర మైన అత్యవసర పరికరాలను, సామా గ్రిని అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి సూచిం చారు. జిల్లాలో ప్రభు త్వ ఆస్పత్రిలో నిరంతరం విద్యుత్తు సరఫరా జరిగేలా జిల్లా వైద్య శాఖ అధికారులు, విద్యుత్‌ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని కోరారు.
కోవిడ్‌ కిట్లనూ కొనుగోలు చేయాలి
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారు లను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రు ల్లో సీజనల్‌ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యాలతో పాటు కోవిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ను, అవసరమైన మందులను కొనుగోలు చేయాలని టీజీఎంఎస్‌ఐడీసీ అధికారులను మం త్రి ఆదేశించారు. అధికారులు సమన్వ యం చేసుకుని పారిశుధ్యతపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు అవసర మైన చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రం లో మందుల కొరత లేకుండా అవస రానికి తగినట్టు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా చొంగ్తు, ఎస్పీడీసీఎల్‌ ఎండీ ముష్రఫ్‌ అలీ, ఎన్పీడీసీఎల్‌ ఎండీ వరుణ్‌రెడ్డి, టీజీఎమ్మెస్‌ఐడీసీ ఎండీ ఫణిందర్‌ రెడ్డి, కాళోజి నారాయణరావు యూని వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ నందకుమార్‌ రెడ్డి, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌, టీవీవీపీ కమిషనర్‌ డా. అజరుకుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -