Wednesday, October 8, 2025
E-PAPER
Homeబీజినెస్అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమి : మా ప్రాధాన్యత బోధన మరియు శిక్షణలపై మాత్రమే కేంద్రీకృతమై...

అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమి : మా ప్రాధాన్యత బోధన మరియు శిక్షణలపై మాత్రమే కేంద్రీకృతమై ఉంది

- Advertisement -

న‌వతెలంగాణ – హైద‌రాబాద్‌ : గత కొన్ని రోజులుగా మేము అందుకున్న అనేక విచారణలకు స్పందనగా ఈ ప్రకటన జారీ చేయడం అయినది. మేము మా విధివిధానాలను స్పష్టం చేస్తూ మా విద్యార్థులు మరియు కమ్యూనిటి నెట్వర్క్ కు పారదర్శకతను అందించడం మా ఉద్దేశం.

మేము SEBI తో పూర్తిగా సహకరిస్తూ వారు కోరిన అదనపు సమాచారము లేదా సహకారాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. అత్యధిక ప్రమాణాలు, పారదర్శకతను నిర్ధారించుటకు మేము వారి మార్గదర్శనాన్ని స్వాగతిస్తున్నాము.

ఈ మధ్య కాలములో అపోహలకు తావిచ్చే సమాచారాన్ని కొందరు వ్యాప్తి చేయబడింది, దీనికి స్పష్టత ఇవ్వవలసి ఉంది. అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమి ఒక శిక్షణ సంస్థ మాత్రమే. ఎట్టి ప్రయోజనాల కోసం, వ్యక్తిగత సలహాలు ఇవ్వడం, ఫిన్‌ఫ్లుయెన్సర్లుగా వ్యవహరించడం, పరిశోధనా నివేదికలు, స్టాక్ రికమెండేషన్లు ప్రచారం చేయడం జరగదు. మేము గురుకుల శిక్షణ వ్యవస్థను అనుసరిస్తూ మార్కెట్లో ఒడిదుడుకులను తట్టుకోవటానికి కావలసిన విలువలు, నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తున్నాము.
– మేము పరిశోధన నివేదికలను లేదా స్టాక్ కి సంబంధించిన సిఫారసులను ప్రచురించము లేదా వ్యాప్తి చేయము
– మేము పర్సనలైస్డ్ పెట్టుబడి సలహాలను అందించము.
– అలాగే మేము వాణిజ్య చిట్కాలను, స్టాక్ కాల్స్ ను ఇవ్వము లేదా హామీ ఇవ్వబడిన రాబడూలను ఇవ్వము.

అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమీ (ASTA) వద్ద మా దృష్టి ఎప్పుడు నిర్మాణాత్మక శిక్షణ కార్యక్రమాల ద్వారా స్వతంత్ర వ్యాపారవేత్తలు మరియు పెట్టుబడిదారులను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. మా శిక్షణ సెషన్లు విశ్లేషణాత్మకత, అమలు మరియు నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేయటానికి రూపొందించబడ్డాయి, తద్వారా మా విద్యార్థులు జ్ఞానం, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసముతో ట్రేడ్ చేయటానికి సంసిద్ధులై ఉంటారు.

భారతదేశపు క్యాపిటల్ మార్కెట్స్ ను రూపకల్పన చేయడములో SEBI కీలక పాత్ర పోషిస్తుంది. వారి క్రియాశీలత మరియు పారదర్శక నియంత్రణ వల్లనే భారతదేశము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నాల్గవ-అతిపెద్ద ఈక్విటి మార్కెట్ గా నిలిచింది. డీమాట్ అకౌంట్స్ సంఖ్య కూడా ఆగస్ట్ 2025 నాటికి 20 కోట్లు దాటింది. ఇది బలమైన పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని మరియు ఆర్ధిక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ అభివృద్ధి పథానికి అద్దం పట్టేలా, భారతదేశ క్యాపిటల్ మార్కెట్స్ లో బాధ్యతాయుతంగా మరియు సమర్థవంతంగా పాల్గొనుటకు వ్యక్తులను సిద్ధం చేయడములో నిర్మాణాత్మక శిక్షణ కార్యక్రమాలు మరియు పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -