నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ‘ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్‌ఫ్లూ)’ కలకలం రేపుతోంది. గోరఖ్‌పూర్‌లోని షాహీద్ అష్ఫాఖుల్లాఖాన్ జూలాజికల్ పార్క్‌లో శక్తి అనే పులి ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాతో బుధవారం మరణించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అన్ని జంతు ప్రదర్శన శాలలు (జూ), సఫారీ పార్క్‌లను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. అన్ని జూలు, సఫారీ పార్కులను మే 20 వరకు వారం రోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు లయన్ సఫారీ పార్క్ డైరెక్టర్ అనిల్ కుమార్ మీడియాకు వెల్లడించారు. అవసరమైన జాగ్రతలు తీసుకున్నామని, పార్క్‌లోని సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించామని అన్నారు. పార్క్‌లోని ఇతర జంతువుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని అన్నారు.
యూపీలో ‘ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కలకలం..జూ పార్కులు మూసివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES