Monday, May 12, 2025
Homeఅంతర్జాతీయంబ‌ంగ్లాదేశ్‌లో అవామీ లీగ్‌పై నిషేధం

బ‌ంగ్లాదేశ్‌లో అవామీ లీగ్‌పై నిషేధం

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: బ‌ంగ్లాదేశ్ మ‌ధ్యంత‌ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌పై ఆ దేశ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ఉపయోగించి ఈ నిషేధాన్ని అమలు చేసింది. బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ (ఐసిటి)లో విచారణ పూర్తయ్యే వరకు అవామీ లీగ్‌పై నిషేధం కొనసాగుతుంది. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే లక్ష్యంతో అవామీ లీగ్‌ను నిషేధించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. జూలై 2024లో జరిగిన నిరసనలో ఫిర్యాదుదారులు, సాక్షులు పాల్గొన్న వారి భద్రతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం నుండి వస్తున్న నివేదికలు త్వరలో అధికారిక ఉత్తర్వు జారీ చేయబడుతుందని ఆదేశ మీడియా వ‌ర్గాలు క‌థ‌నాలు వెలువ‌రించాయి. రాజకీయ అనిశ్చితితో బంగ్లాదేశ్‌లో యూనిస్ ఖాన్ ఆధ్వ‌ర్యంలో మ‌ధ్యంత‌ర ప్ర‌భుత్వం ఏర్పడిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -