Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ పై అవగాహన

కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ పై అవగాహన

- Advertisement -

డాక్టర్ యం మౌనిక 
నవతెలంగాణ – కాటారం

స్థానిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేహించి డాక్టర్ యం మౌనిక మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబం పురుషుల భాగస్వామ్యంతోనే ఈ కళ నిజమవుతుందని ఆమె తెలిపారు. కుటుంబ నియంత్రణ శాశ్వత పద్ధతి పురుషులకు కుట్టుకోతలేని వ్యాసక్టమి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సులువైనది సురక్షితమైనదని అన్నారు. ఐదు నిమిషాలలో ఈ ఆపరేషన్ చేయబడుతుందని తెలిపారు. అపోహలు వీడండి.. ఈ ఆపరేషన్ వలన శరీర పటుత్వానికి, దాంపత్య జీవితానికి ఏ లాంటి ఆటంకము ఉండదని అవగాహన కల్పించారు.

 స్త్రీలకు టూబెట్టమే ఆపరేషన్ ఉందని, కుటుంబ నియంత్రణలో తాత్కాలిక పద్ధతులు కూడా కలవు అని చెప్పారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 4 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వంద పడకల ఆస్పత్రిలో ఉచితముగా పురుషులకు వ్యాసక్టమి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అందుచేత అర్హులైన దంపతులు ఈ సేవలను వినియోగించుకోవాలని స్థానిక వైద్యాధికారుని మౌనిక తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, మహిళా హెల్త్ సూపర్వైజర్ పద్మావతి, హెల్త్ అసిస్టెంట్ సమ్మయ్య, మహిళా హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -