Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలూర్ లో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు 

ఆలూర్ లో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం బాల్యవివాహాల నిరోధంపై అవగాహన–శిక్షణా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ ఎంపీడీఓ గంగాధర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్‌ ముఖ్య  అతిథులుగా పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఐసీడీఎస్‌ సూపర్వైజర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాల్యవివాహాల నిరోధక చట్టం–2006 నిబంధనలపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ చట్టం ప్రకారం బాలుడికి 21 సంవత్సరాలు, బాలికకు 18 సంవత్సరాలు నిండకముందు వివాహం జరపడం నేరమని, అలాంటి వివాహం జరిపిన వారు లేదా ప్రోత్సహించిన వారికి రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండు శిక్షలూ విధించవచ్చని, ఇది బెయిల్‌ లభించని నేరమని అధికారులు తెలిపారు.

ప్రభుత్వం ఈ చట్టం కింద బాల్యవివాహాల నిషేధ అధికారులను నియమించిందని, వారు ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎంపీడీఓ  మాట్లాడుతూ, బాల్యవివాహాలు సామాజికంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తాయని, చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల తల్లి–శిశు మరణాలు పెరుగుతాయని తెలిపారు. పౌషికాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు కూడా ఎక్కువగా తలెత్తుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్‌ సమతా,ఎంపీఓ రాజలింగం, పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్, నవీన్, నసీర్, దినేష్,కిషోర్, నాగేంద్రబాబు, రానా తరుణం, వందన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -