నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ జాతీయ సేవా పథకంలో భాగంగా మంగళవారం సేవా కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ చైర్మన్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె. రాజారామ్ మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణ అలవర్చుకోవాలని పేర్కొన్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ సెల్ఫ్ డెసిషన్ లీడర్షిప్ క్వాలిటీస్ సోషల్ అవేర్నెస్ పెంపొందించుకొని ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా, ఈ దేశం కోసం మనం ఏం సేవ చేసాం అని ఆలోచన సామాజిక స్పృహ అలవర్చుకోవాలని పేర్కొన్నాడు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇన్ ముత్యాలు మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ ఎజెండా వారం రోజుల యాక్టివిటీస్ అంశాలు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరీ సైన్స్ అనిత ప్రైమరీ స్కూల్ హెచ్ఎం లక్ష్మికుమారి, భాస్కరాచారి, నరేష్ ,ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు.


