- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామ భార్గవి హైస్కూల్లో సైబర్ నేరాల నియంత్రణ, డ్రగ్స్ నివారణపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా సత్యనారాయణ గౌడ్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకుని జాగ్రత్తలు చెప్పాలని, డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని అన్నారు. మొబైల్ ని మంచి విషయాలకే ఉపయోగించాలని సూచించారు. ఎటువంటి సమస్యలు ఉన్న 100కు డయల్ చేయాలని సైబర్ నేరాల పట్ల 1930 కి కాల్ చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రగతి పట్వారి, డైరెక్టర్ గోపికృష్ణ ,సామాజిక సేవకులు పట్వారి తులసి, హారిక, వాసు, అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



