Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తడి, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన

తడి, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
99 రోజుల ప్రణాళిక మూడవ రోజులో భాగంగా జుక్కల్ మండల కేంద్రంలోని వీధులలో తడి, పొడి చెత్త ఏం చేసే విధానాన్ని ఆదివారం గ్రామ ప్రజలకు కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ అవగాహన చేశారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలగించి శానిటేషన్ పనులు నిర్వహించారు. గ్రామంలోని నీటి సమస్యలున్న కాలనీలో పైప్ లైన్ లీకేజీలు మరమ్మతులు చేయించారు.

నీటి కుళాయిలను బ్లీచింగ్ పౌడర్ తో కడిగించి శుభ్రం చేయించారు. ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని సుందరవనంగా తీర్చిదిద్దడమే గ్రామ పంచాయతీ లక్ష్యమని గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రామాభివృద్ధికి తోడ్పాటును  అదించాలని అన్నారు. గ్రామానికి చెందిన పలు యువకులు గ్రామాభివృద్ధిలో నిత్యం తోడ్పాటు అందిస్తున్నారని వారికి మాకు గ్రామపంచాయతీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని గ్రామ సర్పంచ్, దీప్తి కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిపి కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -