Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల వ్యయ పరిమితిపై అవగాహన…

ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల వ్యయ పరిమితిపై అవగాహన…

- Advertisement -

– హాజరైన జిల్లా అదనపు  కలెక్టర్ వీరారెడ్డి
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి  మండలంలో అనాజిపురంలో జి ఎన్ పి   ఫంక్షన్ హల్ నందు 2వ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు సర్పంచులు, వార్డువాభ్యులకు సంబంధించి ఎన్నికల వ్యయంపై  అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఎలక్షన్ అబ్జర్వర్ శ్రీనివాస్ లు హాజరై, మాట్లాడారు.  సర్పంచుకు ఎన్నికల వ్యయ పరిమితి రూ.1,50,000, వార్డు సభ్యులకు  30,000 మించి వ్యయం చేయకుండా ఉండాలని, ప్రతి పోటీ చేయు అభ్యర్థి ఒక నూతన  బ్యాంకు ఖాతా  ఓపెన్ చేయాలని అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి  రూరల్ సి ఐ  చంద్రబాబు, ఎస్ఐ అనిల్ కుమార్ , ఎంపీడీవో సిహెచ్ శ్రీనివాస్, తాసిల్దారు అంజి రెడ్డి లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -