Thursday, April 2, 2026
E-PAPER
Homeకరీంనగర్వార్డు సభలో సంక్షేమ పథకాలపై అవగాహన

వార్డు సభలో సంక్షేమ పథకాలపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గురువారం పట్టణంలోని 4వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ తురగ సౌజన్య అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథులుగా కమీషనర్ కె.నాగరాజు,తహశీల్దార్ నాగార్జున,ఎంఈఓ రాఘవులు,ఎస్.ఐ సుధీర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రజా సమస్యలు,అభివృద్ధి అంశాలపై చర్చించారు.వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక,సమస్యల పరిష్కారంపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి,వార్డు అధికారి బి.రాకేష్ రావు, ఆర్పీ రిజ్వాన, ఏఎన్‌ఎం విజయలక్ష్మిఅంగన్‌వాడీ టీచర్లు సుమలత, రజిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -