Wednesday, February 4, 2026
E-PAPER
HomeNewsప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పీహెచ్‌సీలో అవగాహన కార్యక్రమం

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పీహెచ్‌సీలో అవగాహన కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకున కాటారం మండల కేంద్రంలో గల స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం అవగాహన కార్యక్రమం స్థానిక వైద్య అధికారిణి డా. మౌనిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… క్యాన్సర్ వ్యాధి కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలు, ముందస్తు గుర్తింపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. పొగాకు, మద్యపానం వంటి దుష్ట అలవాట్లకు దూరంగా ఉండాలని, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆమె సూచించారు.

అలాగే శరీరంలో గడ్డలు ఏర్పడటం, కారణం తెలియని బరువు తగ్గడం, దీర్ఘకాలిక దగ్గు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చని తెలిపారు. ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స విజయవంతంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ టి సమ్మయ్య,  మహిళా హెల్త్ అసిస్టెంట్స్ శ్యామల, కే శ్యామల, ఆశా కార్యకర్తలు రాజేశ్వరి, రమ, పద్మ, స్వరూపారాణి, రుక్సానా, సమ్మక్క, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -