Tuesday, February 10, 2026
E-PAPER
Homeజిల్లాలుయూరియా బుకింగ్‌పై రైతుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

యూరియా బుకింగ్‌పై రైతుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

- Advertisement -
  • మండల వ్యవసాయ అధికారులు మహేశ్వరి ఆధ్వర్యంలో

నవతెలంగాణ-జుక్కల్: జిపిఆర్ఎస్‌కి, డీలర్స్ అందరికీ యూరియా బుకింగ్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని మంగళవారం జుక్కల్ మండల కేంద్రంలోని మండల వ్యవసాయ అధికారులు మహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి రైతులకు అవగాహన కార్యక్రమంలో పలు ముఖ్యమైన అంశాలను తెలియజేశారు. ఏవో మాట్లాడుతూ జిపిఆర్ఎస్ ఆన్లైన్ల్ విషయం పైన రైతులకు సమావేశం ఏర్పాటు చేసి రైతుల చేతనే బుకింగ్ యాప్‌లో ఎలా బుక్ చేసుకోవాలో త‌ర్పీదు ఇచ్చారు. రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా ఫర్టిలైజర్ షాప్ దగ్గరనే జిపిఓఎస్‌ని సేవ‌లు ఉంటాయ‌ని తెలిపారు.సమావేశానంతరం జుక్కల్ గ్రామశివారులోని పంట పొలాల‌ను పరిశీలించి, రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రానికి సంబంధించిన రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -