Saturday, October 18, 2025
E-PAPER
Homeబీజినెస్చిన్న మొత్తాల ప్రాపర్టీ రుణాల సాధనం ‘శక్తి’ ని ఆవిష్కరించిన యాక్సిస్ ఫైనాన్స్

చిన్న మొత్తాల ప్రాపర్టీ రుణాల సాధనం ‘శక్తి’ ని ఆవిష్కరించిన యాక్సిస్ ఫైనాన్స్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో ఒకటైన యాక్సిస్ ఫైనాన్స్ లిమిటెడ్ (AFL), ధన్‌తెరాస్ సందర్భంగా యాక్సిస్ ఫైనాన్స్ శక్తి పెరిట ప్రాపర్టీలపై మైక్రో లోన్ (మైక్రో ఎల్ఏపీ) ప్రోడక్టుని ప్రవేశపెట్టింది. వ్యాపార, వ్యక్తిగత అవసరాలకు తగ్గ ఆర్థిక సొల్యూషన్స్‌ని అందించడం ద్వారా వర్ధమాన కస్టమర్లకు సాధికారత కల్పించేలా ఈ ప్రోడక్ట్ రూపొందించబడింది.

తయారీ, ట్రేడింగ్, సర్వీసు రంగాలకు చెందిన మైక్రో ఎంట్రప్రెన్యూర్లు, ట్రేడర్లు, స్వయం ఉపాధి పొందే వారితో పాటు వేతనాలు పొందే కస్టమర్లకు కూడా అనువుగా ఉండేలా యాక్సిస్ ఫైనాన్స్ శక్తి రూపొందించబడింది. చాలా తక్కువ స్థాయి డాక్యుమెంటేషన్‌తో, వివిధ వ్యాపార వర్గాలకు విస్తృత స్థాయిలో సంఘటిత రుణాలను అందుబాటులోకి తేవడం ఈ ప్రోడక్టు లక్ష్యం. సరళతరమైన ప్రక్రియ, సులభతరమైన కాలవ్యవధుల ఆప్షన్లు, తనఖాగా విస్తృత స్థాయిలో ప్రాపర్టీలను అంగీకరించే విధమైన యాక్సిస్ ఫైనాన్స్ శక్తి ప్రోడక్టు, కస్టమర్లు తమ ప్రాపర్టీని వ్యాపార వృద్ధి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు లేదా వ్యక్తిగత లక్ష్యాలకు ఉపయోగించుకునేందుకు తోడ్పడుతుంది. కస్టమర్ ఆధారితమైన, కస్టమైజ్డ్ ఆర్థిక సాధనాలను అందించాలన్న AFL నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

“ధన్‌తెరాస్ సందర్భంగా యాక్సిస్ ఫైనాన్స్ శక్తిని ఆవిష్కరించడమనేది ఆర్థిక సమ్మిళితత్వం, కస్టమర్ ఆధారిత సొల్యూషన్స్ విషయంలో మా నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. సాధారణంగా సంఘటిత రుణాలను పొందడంలో సవాళ్లు ఎదుర్కొనే మైక్రో-ఎంట్రప్రెన్యూర్లు, ట్రేడర్లు, స్వయం ఉపాధి పొందేవారికి ఉపయోగపడే విధంగా ఇది రూపొందించబడింది. సరళతరమైన కాలవ్యవధులు, తనఖాకి సంబంధించి విస్తృత స్థాయిలో ప్రాపర్టీలకు ఆమోదయోగ్యత, సరళతరమైన డాక్యుమెంటేషన్ వంటి అంశాల దన్నుతో వ్యాపార మరియు వ్యక్తిగత వృద్ధి కోసం కస్టమర్లు తమ ప్రాపర్టీని ఉపయోగించుకునేందుకు శక్తి సహాయపడుతుంది. వివిధ సెగ్మెంట్లవ్యాప్తంగా రుణ అంతరాలను భర్తీ చేసేందుకు, పురోగతికి తోడ్పడేందుకు ఇది ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాం” అని యాక్సిస్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ & సీఈవో సాయి గిరిధర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -