Sunday, March 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతొల్లా అరాఫీ

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతొల్లా అరాఫీ

- Advertisement -

నవతెంగాణ – హైదరాబాద్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన వారసుడిగా అయతొల్లా అలిరెజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఆదివారం నియమించింది. టెహ్రాన్‌లోని నివాసంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇస్లామిక్ విప్లవ నేత ఖొమేనీ మరణం తర్వాత, 1989 నుంచి ఖమేనీ ఇరాన్ అత్యున్నత నాయకుడిగా కొనసాగుతూ వచ్చారు.

ఖమేనీ మరణం తర్వాత దేశ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, జ్యుడీషియరీ చీఫ్ గులాంహొస్సేన్ మొహసెని ఎజెయి, గార్డియన్ కౌన్సిల్ జ్యూరిస్ట్ ఉంటారని ‘ఐఆర్‌ఎన్‌ఏ’ (ఐఆర్ఎన్ఏ) వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ తదుపరి పూర్తిస్థాయి సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకు ఈ కౌన్సిల్ బాధ్యతలు నిర్వహిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -