Friday, May 9, 2025
Homeఆటలుక్వార్టర్స్‌లో ఆయుష్‌

క్వార్టర్స్‌లో ఆయుష్‌

- Advertisement -

– కిదాంబి శ్రీకాంత్‌పై సాధికారిక విజయం
– తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ 2025
తైపీ సిటీ (తైవాన్‌):
భారత యువ షట్లర్‌ ఆయుష్‌ శెట్టి తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. వరుసగా రెండో విజయం నమోదు చేసిన ఆయుష్‌ శెట్టి పురుషుల సింగిల్స్‌లో సత్తా చాటాడు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్లో మాజీ వరల్డ్‌ నం.1, భారత అగ్రశ్రేణి షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌పై మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొందాడు. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో ఆయుష్‌ శెట్టి 21-16, 15-21, 21-17తో కిదాంబి శ్రీకాంత్‌పై గెలుపొందాడు. తొలి గేమ్‌ను 21-16తో సొంతం చేసుకున్న ఆయుష్‌.. రెండో గేమ్‌లో కిదాంబికి తలొగ్గాడు. కీలక గేమ్‌లో పైచేయి సాధించిన శ్రీకాంత్‌ జోరందుకున్నట్టే కనిపించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో శ్రీకాంత్‌ను చిత్తు చేసిన శెట్టి క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ కైవసం చేసుకున్నాడు. నేడు సెమీఫైనల్లో చోటు కోసం కెనడా షట్లర్‌, ఏడో సీడ్‌ బ్రయాన్‌ యాంగ్‌తో ఆయుష్‌ శెట్టి తలపడనున్నాడు. మరో ప్రీ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో తరుణ్‌ మానెపల్లి వరుస గేముల్లో నిరాశపరిచాడు. 34 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో 13-21, 9-21తో మహ్మద్‌ జాకి చేతిలో ఓటమి చెందాడు.
మహిళల సింగిల్స్‌ విభాగంలో అన్‌సీడెడ్‌ ఉన్నతి హుడా సైతం క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. చైనీస్‌ తైపీ షట్లర్‌ లిన్‌ సి యన్‌పై 21-12, 21-7తో ఉన్నతి మెరుపు విజయం సాధించింది. 27 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసిన ఉన్నతి నేడు జరిగే క్వార్టర్‌ఫైనల్‌ సమరంలో మరో చైనీస్‌ తైపీ షట్లర్‌ హంగ్‌ యి టింగ్‌తో పోటీపడనుంది. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌, అనుపమ ఉపాధ్యాయ, అన్మోల్‌, రక్షిత శ్రీ రామ్‌రాజ్‌లు తొలి రౌండ్లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. డబుల్స్‌ విభాగంలో భారత షట్లరు ఎవరూ పోటీపడటం లేదు. సాత్విక్‌, చిరాగ్‌ శెట్టి సహా పుల్లెల గాయత్రి, ట్రెసా జాలిలు తైపీ ఓపెన్‌కు దూరంగా ఉన్నారు. సింగిల్స్‌ స్టార్‌ షట్లర్లు పి.వి సింధు, లక్ష్యసేన్‌, హెచ్‌.ఎస్‌ ప్రణరు సైతం తైపీ ఓపెన్‌లో పోటీపడటం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -