నవతెలంగాణ-హైదరాబాద్: నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనా సీపీ రాధాకృష్ణన్ ను ఇండియా బ్లాక్ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ భవన్ కు స్వయంగా వెళ్లి ఆయనకు వీపీ గా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన వీపీ పోలింగ్ లో బి.సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఏన్డేయే కూటమి అభ్యర్థికి 450 ఓట్లు రాగా..ఇండియా బ్లాక్ అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు పొందారు. అదే విధంగా ఈనెల 12న 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన బి. సుదర్శన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES