నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ నటుడు కోట అకాల మరణ వార్త విన్న బాబూ మోహన్ భావోద్వేగానికి గురయ్యారు. కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం. నిన్న రాత్రి కూడా కోటతో మాట్లాడాను. కోట మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది” అని బాబూమోహన్ ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే కోట మరణవార్తను విన్న ప్రముఖులు తమ షూటింగులను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ పయనమవుతున్నారు. ఫిల్మ్ నగర్ లో ఉన్న నివాసంలో కోట భౌతికకాయం ఉండగా.. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నటుడు కోట శ్రీనివాస రావు కు నివాళులు అర్పిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు(83) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా శ్లోక సంద్రంలోకి వెళ్ళిపోయింది. కోట శ్రీనివాస రావు – బాబూ మోహన్ కలిసి వందలాది చిత్రాలు తీశారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.