Monday, September 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపురుగుని మింగేసిన పాప.. ఊపిరాడక మృతి

పురుగుని మింగేసిన పాప.. ఊపిరాడక మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్; తమిళనాడు తిరువళ్లూరు జిల్లా పెరియపాళ్యం సమీపంలోని తామరైపాక్కానికి చెందిన రైతు కూలీ కార్తిక్‌ కుమార్తె గుగశ్రీ (1) సోమవారం ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటూ అనుకోకుండా పురుగుని మింగింది. అది కాస్త గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక ఇబ్బంది పడింది. తల్లిదండ్రులు వెంటనే తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గుగశ్రీ మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -